Tirumala ghat road: తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం.. వీడియో ఇదిగో!

Tirumala Bike Rider Injured in Ghat Road Rockfall
  • కొండ పైనుంచి పడిన రాయి.. బైకర్ కు తీవ్రగాయాలు
  • గాయపడిన వ్యక్తి లగేజి సెంటర్లో వెండార్ గా పనిచేసే లోకేశ్ గా గుర్తింపు
  • సోమవారం రాత్రి నుంచి తిరుమలలో వర్షం
తిరుమలలో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మంగళవారం ఉదయం ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. కొండ పైకి వెళుతున్న ఓ బైకర్ పై రాయి పడింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతర భక్తులు గమనించి అంబులెన్స్ కు, టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని తిరుమల లగేజ్ సెంటర్ లో పనిచేసే లోకేశ్ గా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం లోకేశ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని చెప్పారు.

వర్షం కారణంగా కొండ పైనుంచి పడుతున్న రాళ్లు
మంగళవారం డ్యూటీకి బయలుదేరిన లోకేశ్.. రెండో ఘాట్ రోడ్డులో హరిణి ప్రాంతం దగ్గర ప్రమాదానికి గురయ్యాడు. వర్షం కారణంగా కొండ పైనుంచి ఓ రాయి దొర్లుకుంటూ వచ్చి మీద పడింది. దీంతో లోకేశ్ బైక్ పైనుంచి కిందపడ్డాడు. అతడి తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు అంబులెన్స్ కు ఫోన్ చేసి లోకేశ్ ను ఆసుపత్రికి తరలించారు. లోకేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని స్విమ్స్ వైద్యులు తెలిపారు.
Tirumala ghat road
Rain
Accident
Lokesh
TTD
Srinivasam Hospital
Second ghat road
Harini area

More Telugu News