Amazon Employee: రూ.7.4 లక్షల జీతం నుంచి రూ.60 లక్షల జీతం ఇచ్చే ఉద్యోగానికి జంప్... టెక్కీ పోస్ట్ వైరల్
- రెడిట్‌లో తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని పంచుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్
- టైర్-3 కాలేజీ నుంచి వచ్చి అద్భుత విజయం సాధించిన వైనం
- కఠోర శ్రమ, సరైన ప్రణాళికతో ఇంటర్వ్యూకి సిద్ధమైన తీరు
- ఉద్యోగంతో పాటు వ్యక్తిగతంగానూ ఎదిగానని వెల్లడి
పట్టుదల, సరైన ప్రణాళిక ఉంటే సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వారు కూడా అద్భుతాలు సాధించవచ్చని ఓ టెక్ నిపుణుడు నిరూపించాడు. సర్వీస్ ఆధారిత కంపెనీలో కేవలం రూ.7.4 లక్షల వార్షిక వేతనంతో కెరీర్ ప్రారంభించి, ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం అమెజాన్‌లో ఏకంగా రూ.60 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. తన ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇటీవల రెడిట్ (Reddit) వేదికగా పంచుకోగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఆత్మవిశ్వాసం లేని స్థాయి నుంచి...!
"జేఈఈ మెయిన్స్‌లో 360కి 17 మార్కులు, 12వ తరగతిలో 73% మార్కులు మాత్రమే సాధించాను. ఒకప్పుడు చదువు, క్రీడల్లో చురుగ్గా ఉండే నేను, ఉన్నట్టుండి వెనుకబడిపోయాను. ఓ టైర్-3 కాలేజీలో చేరాను. అప్పుడు నాలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువ. కానీ కాలేజీలో మంచి స్నేహితులు దొరికారు. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, నన్ను నేను ఏకాంతంలో బంధించుకున్నాను. అది చాలా కష్టమైన దశ, కానీ నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఆ సమయం ఎంతగానో ఉపయోగపడింది" అని ఆ టెక్కీ తన పోస్టులో వివరించాడు.
మొదట ఓ సర్వీస్ ఆధారిత కంపెనీలో రూ.7.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగంలో చేరినట్టు తెలిపాడు. అక్కడ కష్టపడి పనిచేసి, ఆ తర్వాత ఓ స్టార్టప్ కంపెనీకి రూ.13.5 లక్షల ప్యాకేజీతో మారినట్టు చెప్పాడు. "ఒకరోజు లింక్డ్ఇన్ ద్వారా అమెజాన్ రిక్రూటర్ నన్ను సంప్రదించారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్-2 (SDE2)గా ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాను. అయితే, ఈ ఉద్యోగం ఒక్కటే నా కథ కాదు. నేను వ్యక్తిగతంగా ఎదిగాను. పూర్తిగా మారిపోయాను. ఇప్పుడు మంచి ఫిట్నెస్తో, హాస్యచతురతతో, గతంలో ఎన్నడూ లేని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను" అని అతడు పేర్కొన్నాడు.
ఇంటర్వ్యూకి ఎలా సిద్ధమయ్యాడంటే...!
ఈ విజయం వెనుక తన ఓపిక, కఠోర శ్రమ ఉన్నాయని అతడు తెలిపాడు. పెద్ద టెక్ కంపెనీలు అభ్యర్థి పాత జీతం ఆధారంగా కాకుండా, వారి అంతర్గత లెవెల్ బ్యాండ్స్ ఆధారంగా జీతాలు నిర్ణయిస్తాయని కీలకమైన విషయాన్ని పంచుకున్నాడు. అమెజాన్ ఇంటర్వ్యూ కోసం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ (DSA) కోసం 'స్ట్రైవర్ SDE షీట్', లో-లెవెల్ డిజైన్ (LLD) కోసం ఓపెన్-సోర్స్ రిపాజిటరీ, హై-లెవెల్ డిజైన్ (HLD) కోసం యూట్యూబర్ గౌరవ్ సేన్ వీడియోలను అనుసరించినట్లు వెల్లడించాడు.
అమెజాన్‌లోని ఎంపిక ప్రక్రియ మొత్తం ఐదు రౌండ్లలో జరిగిందని వివరించాడు. ఇందులో ఆన్లైన్ అసెస్మెంట్, డీఎస్ఏ రౌండ్, ఎల్ఎల్డీ రౌండ్, బార్ రైజర్ (సమస్య పరిష్కారం), హెచ్ఎల్డీ రౌండ్ ఉన్నాయని పేర్కొన్నాడు.
అతడి కథనం టెక్ కమ్యూనిటీలో, ముఖ్యంగా నాన్-ప్రీమియర్ కాలేజీల నుంచి వచ్చిన యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సరైన నైపుణ్యాలు పెంచుకుంటే కెరీర్లో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని ఆయన ప్రయాణం నిరూపిస్తోంది. "మీ కథ మా లాంటి వారికి ఎంతో స్ఫూర్తిదాయకం" అంటూ నెటిజన్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.