Kishan Reddy: సికింద్రాబాద్ నియోజకవర్గ విద్యార్థులకు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

Kishan Reddy Announces Key Initiative for Secunderabad Students
  • సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు చెల్లిస్తానని వెల్లడి
  • ఫీజును తన వేతనం నుంచి చెల్లిస్తానన్న కిషన్ రెడ్డి
  • ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిన కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బాటలో ఆయన కూడా విద్యార్థుల ఫీజులు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరి పరీక్ష ఫీజులను తన వ్యక్తిగత వేతనం నుంచి చెల్లిస్తానని ఆయన స్పష్టం చేశారు.

పేద విద్యార్థుల విద్యకు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో, అంత్యోదయ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఒక లేఖ రాశారు. నియోజకవర్గంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులెందరు ఉన్నారో, ఎంత మొత్తం అవసరమో తెలియజేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

వారం రోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా తన నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును తానే చెల్లిస్తానని ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు ఆయన సంబంధిత జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు.
Kishan Reddy
Kishan Reddy Secunderabad
Secunderabad
Bandi Sanjay
Telangana BJP

More Telugu News