జగద్గిరిగుట్టలో అందరూ చూస్తుండగానే యువకుడిపై రౌడీషీటర్ హత్యాయత్నం
- రోషన్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన బాల్ రెడ్డి
- దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన రోషన్ ఆసుపత్రికి తరలింపు
- రక్తపు మడుగులో ఉన్న రోషన్‌ను చూసి భయాందోళనకు గురైన స్థానికులు
ఈ దాడిలో రోషన్ తీవ్రంగా గాయపడటంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రక్తపు మడుగులో ఉన్న రోషన్‌ను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీల కోణంలోనే ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.