Pawan Kalyan: ఫ్లెమింగోలకే కాదు, పులస చేపలకూ శాశ్వత నివాసం కల్పించండి: పవన్‌పై భూమన సెటైర్

Bhuma Karunakar Reddy Satires on Pawan Kalyans Flamingo Comments
  • ఫ్లెమింగోలకు శాశ్వత నివాసం కల్పించాలన్న పవన్ వ్యాఖ్యలపై వ్యంగ్యం
  • పులస చేపలకు కూడా శాశ్వత ఆవాసం ఏర్పాటు చేయాలని ఎద్దేవా
  • రాష్ట్రంలో వాతావరణాన్ని చల్లగా ఉంచాలని చురకలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని పవన్ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, ఆయనపై సెటైర్లతో విరుచుకుపడ్డారు.

భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. "పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని మీరు అనడం అభినందనీయం. మీ పేరులోనే పవనం, కల్యాణం రెండూ ఉన్నాయి. అదేవిధంగా, సైబీరియా నుంచి వందల ఏళ్లుగా వలస వచ్చే ఫ్లెమింగోల తరహాలోనే, వందల కిలోమీటర్లు ప్రయాణించి గోదావరికి వచ్చే పులస చేపలకు కూడా శాశ్వత నివాసం కల్పించాలని కోరుతున్నాం" అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, "ఏప్రిల్, మే నెలల్లో శీతల వాతావరణాన్ని మీ అధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో శాశ్వతంగా చల్లదనం ఉండేలా చూడాలి" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సనాతన ధర్మ పరిరక్షకులుగా పవన్ కల్యాణ్ ఇంకా ఎన్నో చేయాలని భూమన చురకలంటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలు జరగకుండా రోడ్లు వేయాలని, దేవాలయాల్లో ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మద్యం మత్తులో అనర్థాలు జరగకుండా చూడాలని సూచించారు. "మీరు గాల్లో పక్షుల్ని, నీటిలో చేపల్ని కూడా మీ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకోవడం అభినందనీయం. ప్రకృతిని శాసించే శక్తి మీకు కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా" అని అన్నారు. ఇప్పటికే మీ జ్ఞాన తృష్ణ ప్రజలకు అర్థం అయ్యిందని వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Bhuma Karunakar Reddy
Pulasa fish
Flamingo birds
Pulicat Lake
Andhra Pradesh politics
Satire
TDP
YSRCP
Political criticism

More Telugu News