టిప్పర్ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం.. ఘటనపై విచారణకు ఆదేశం: పొన్నం ప్రభాకర్
- క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ
- బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు వెల్లడి
రహదారిపై ఉన్న ఓ గుంతను తప్పించే ప్రయత్నంలో టిప్పర్ లారీ అదుపుతప్పి రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో హృదయ విదారక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.