KTR: పేదల ఇళ్ల కూల్చివేతపై రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?: కేటీఆర్
- మేం కట్టాం, మీరు కూలుస్తున్నారు: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
- నన్ను దాటి బుల్డోజర్ వెళ్లాలన్న రాహుల్ ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? అంటూ నిలదీత
- 500 రోజుల్లో కేసీఆర్ సర్కార్ తిరిగి వస్తుంది, బాధితులకు న్యాయం చేస్తుందని హామీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ల కూల్చివేతలకు పాల్పడుతోందని, ఈ అన్యాయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో తనను దాటి బుల్డోజర్లు వెళ్లాలని సవాల్ విసిరిన రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చేపడుతున్న కూల్చివేతలపై కేటీఆర్ ఒక ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గతంలో ఢిల్లీలో మాట్లాడిన పాత వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. "ధనికులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం" అనే నినాదంతో ఈ ప్రజెంటేషన్ సాగింది. ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోయిన పలువురు బాధితులు కూడా ఈ సమావేశంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం రాజధానిలో అరాచకం సృష్టిస్తోందని, దీనివల్ల ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ధనికులను వదిలేసి, పేదలపైనే ప్రతాపం చూపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. చెరువులను కబ్జా చేసి ఓ రెవెన్యూ మంత్రి ఇల్లు కట్టుకున్నారని, హిమాయత్ సాగర్ సమీపంలో మరో మంత్రి వివేక్ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కట్టుకున్నా హైడ్రా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని అన్నారు. "పేదలు కోర్టుకు వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లు కూల్చేస్తున్నారు. కానీ, సీఎం సోదరుడికి మాత్రం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం కల్పించారు. ఇదేనా మీ న్యాయం?" అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో ఇల్లు కట్టినా నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా హైడ్రాకు లేదని ఆయన ఎద్దేవా చేశారు.
గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాలు జరిగాయని కేటీఆర్ గుర్తుచేశారు. "హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించాం. వైట్‌హౌస్‌తో పోటీపడేలా సచివాలయం నిర్మించాం. దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు, భారీ సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేశాం. కానీ, ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది కేవలం కూల్చివేతలే" అని ఆయన దుయ్యబట్టారు. కూల్చివేతల సందర్భంగా ఒక గర్భిణిని తోసేశారని, మూడు సంవత్సరాల చిన్నారి ఆకలితో అలమటించిందని చెబుతూ సంబంధిత ఫొటోలు, వీడియోలను ప్రదర్శించారు.
ఇంకో 500 రోజుల్లో తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక బాధితులందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.