Rajamahendravaram Central Jail: రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో సిబ్బంది బాగోతం.. ఖైదీకి బిర్యానీ, గుట్కా సరఫరా
- రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో వెలుగు చూసిన అక్రమాలు
- డబ్బులు తీసుకుని ఖైదీకి గుట్కా, బిర్యానీ సరఫరా
- ఆన్‌లైన్‌లో లంచాలు స్వీకరించిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు
- ఖైదీ వద్ద గుట్కా ప్యాకెట్ దొరకడంతో బయటపడ్డ నిజం
- ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన జైలు అధికారులు
కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో కొందరు సిబ్బందే అక్రమాలకు పాల్పడుతున్న ఘటన కలకలం రేపింది. ఒక ఖైదీకి డబ్బులు తీసుకుని ఏకంగా గుట్కా ప్యాకెట్లు, బిర్యానీ సరఫరా చేస్తున్న వ్యవహారం ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ద్వారా లంచం తీసుకుని సిబ్బందే ఈ దందాకు పాల్పడటం గమనార్హం.
వివరాల్లోకి వెళితే... జైలులోని ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో బషీర్, సుషీల్ అనే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఇదే సెక్షన్‌లో సహాయకుడిగా ఉన్న రామకృష్ణ అనే ఖైదీకి బయటి నుంచి గుట్కా, బిర్యానీ వంటివి కావాల్సి వచ్చింది. దీంతో అతని బంధువులు బషీర్ బ్యాంకు ఖాతాకు రూ.1000, సుషీల్ ఖాతాకు రూ.2000 ఆన్‌లైన్‌లో పంపించారు. డబ్బులు అందిన తర్వాత వీరిద్దరూ బయటి నుంచి ఆ వస్తువులను తెచ్చి రహస్యంగా రామకృష్ణకు అందించారు.
అయితే, ఆదివారం ఉదయం మరో జైలు ఉద్యోగికి ఓ ఖైదీపై అనుమానం రావడంతో తనిఖీ నిర్వహించారు. ఈ సోదాలో అతని వద్ద ఒక గుట్కా ప్యాకెట్ బయటపడింది. అతడిని లోతుగా విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దందాలో భాగంగా మొత్తం 20 గుట్కా ప్యాకెట్లు జైల్లోకి చేరినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరైన సుషీల్ మూడు నెలల క్రితమే కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో చేరడం గమనార్హం.
ఈ ఘటన బయటపడినప్పటికీ, ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం రాత్రి 8 గంటల వరకు తర్జనభర్జన పడినట్లు తెలిసింది. చివరకు ఇద్దరు సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం పరిపాలనా భవనంలో ఖైదీలతో పనిచేయించుకోకూడదు. కానీ సిబ్బంది కొరత కారణంగా అధికారులు ఈ నిబంధనను పక్కనపెట్టారు. జైళ్ల శాఖ డీఐజీ కార్యాలయం సమీపంలోనే ఉన్నా ఇలాంటి అక్రమాలు యథేచ్ఛగా జరగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.