గుజరాత్‌లో కీలక పరిణామం... ముఖ్యమంత్రి మినహా మంత్రులంతా రాజీనామా!
- ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా తప్పుకున్న మంత్రులు
- రేపు మధ్యాహ్నం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
- పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా రాజీనామా
మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్త వారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు.