భర్తను తలుచుకుని కంటతడి పెట్టిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
- రహమత్ నగర్ బహిరంగ సభ వేదికపై ఉద్వేగానికి లోనైన మాగంటి సునీత
- నియోజకవర్గ ప్రజలు తమను సొంత కుటుంబంలా భావిస్తున్నారని వ్యాఖ్య
- ప్రజలను గోపీనాథ్ తన కుటుంబ సభ్యులుగా చూసుకునే వారని వ్యాఖ్య
"గోపన్న అంటేనే జనం.. జనం అంటేనే గోపన్న. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను గోపీనాథ్ కుటుంబ సభ్యులుగా భావించేవారు. ఈరోజు ఆయన కోసం కుటుంబం తరలి వచ్చింది. ఆయన పైనుండి చూస్తూనే ఉంటారు. మనమందరం కలిసి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకువెళదాం. నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా భావించండి. గోపీనాథ్ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించేవారు" అని ఆమె పేర్కొన్నారు.