ప్లాట్ ఫాం పైకి చేరుకోవడానికే 2 గంటలు.. ఎల్బీ నగర్ మెట్రో కిటకిట.. వీడియో ఇదిగో!
- ప్రయాణికుల ధాటికి మొరాయించిన ఎస్కలేటర్
- క్యూ పద్దతిలో ప్రయాణికుల్ని పంపుతున్న మెట్రో సిబ్బంది
- మెట్రో స్టేషన్ బయట కిలోమీటర్ మేర జనం క్యూ
మెట్రో స్టేషన్ లో ఇసుకవేస్తే నేలపై రాలనంత రద్దీ నెలకొంది. టికెట్ తీసుకోవడానికి, తీసుకున్నాక ప్లాట్ ఫాం పైకి చేరుకోవడానికి ఏకంగా రెండు గంటల సమయం పడుతోంది. స్టేషన్ బయట కిలోమీటర్ మేర ప్రయాణికులు క్యూ కట్టారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ కు భయపడి మెట్రోను ఆశ్రయిస్తే.. మెట్రో స్టేషన్ లోనే భారీగా రద్దీ నెలకొనడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.