Enugu Mahender Reddy: లండన్‌లో గుండెపోటుతో జగిత్యాల యువకుడి మృతి

Enugu Mahender Reddy Jagityala youth dies of heart attack in London
  • జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం, దమ్మన్నపేటకు చెందిన మహేందర్ రెడ్డి మృతి
  • రెండేళ్ల క్రితం పీజీ చేసేందుకు లండన్ వెళ్లిన మహేందర్ రెడ్డి
  • ఇటీవల పీజీ పూర్తి చేసుకొని, వర్క్ వీసా పొందిన మహేందర్ రెడ్డి
లండన్‌లో గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం, దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి పీజీ చేసేందుకు రెండు సంవత్సరాల క్రితం లండన్ వెళ్లాడు. ఇటీవలనే అతడు తన పీజీని పూర్తి చేశాడు. అంతేకాకుండా, అతనికి వర్క్ వీసా కూడా లభించింది.

మహేందర్ రెడ్డి తండ్రి కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ విషాదకర ఘటనపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి అకాల మరణంతో దమ్మన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Enugu Mahender Reddy
London
Jagityala
Heart Attack
Telangana Student
Medipalli
Dammannapet

More Telugu News