తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం!
- లోయర్ ట్యాంక్ బండ్ నుండి సచివాలయానికి కలుపుతూ ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్
- తెలంగాణ తల్లిగా మార్చాలని నిర్ణయం
- కార్పొరేషన్‌కు సిఫార్సు చేయాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగింది. కమిటీ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటమ్స్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు కూడా ఉంది.