Azarashi: కొడుకు కన్నా చిన్నవాడితో 63 ఏళ్ల మహిళ వివాహం.. పోగొట్టుకున్న ఫోన్‌తో మొదలైన ప్రేమకథ!
- కొడుకు కన్నా చిన్నవాడైన యువకుడిని పెళ్లాడిన 63 ఏళ్ల జపాన్ మహిళ
- 32 ఏళ్ల వయసు తేడాతో ఒక్కటైన జంట
- పెళ్లికి అండగా నిలిచిన ఆమె కొడుకు, మొదట వ్యతిరేకించిన అతని తల్లి
- ప్రస్తుతం మ్యారేజ్ ఏజెన్సీ నడుపుతున్న ఈ జంట
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి వింత ప్రేమకథ
ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, జపాన్‌కు చెందిన ఓ జంట తమ వినూత్న ప్రేమకథతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 63 ఏళ్ల అజరాషి అనే మహిళ, తన కన్న కొడుకు కన్నా ఆరేళ్లు చిన్నవాడైన 31 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. వీరి మధ్య 32 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, వారి బంధం ఎంతో దృఢంగా సాగుతోంది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, వీరి ప్రేమకథ 2020లో టోక్యోలోని ఓ కేఫ్‌లో చాలా సాధారణంగా మొదలైంది. అక్కడ ఓ యువకుడు మర్చిపోయిన ఫోన్‌ను అజరాషి చూశారు. కాసేపటికి ఫోన్ కోసం వెతుక్కుంటూ వచ్చిన అతనికి దాన్ని తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులకు విధి మరోసారి వారిని కలిపింది. ఇద్దరూ ఒకే ట్రామ్‌లో ప్రయాణిస్తుండగా ఒకరినొకరు గుర్తుపట్టుకుని, ఫోన్ నంబర్లు మార్చుకున్నారు.
అప్పటికే 48 ఏళ్ల వయసులో విడాకులు తీసుకుని, ఒంటరిగానే తన కొడుకును పెంచిన అజరాషి.. మొదట డేటింగ్ యాప్స్‌లో ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఒంటరిగా ఉండటానికే నిశ్చయించుకున్నారు. పెంపుడు కుక్కల దుస్తుల వ్యాపారం చూసుకుంటూ జీవిస్తున్నారు. అయితే, ఆ యువకుడితో పరిచయం ఆమె జీవితాన్ని మార్చేసింది. రోజూ గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
"నేను ఏ విషయం గురించి మాట్లాడినా, అది నా పని అయినా, రోజువారీ జీవితం అయినా, నా ఇష్టాలైనా.. అతను అర్థం చేసుకుంటాడు. నాపై అతనికి నిజమైన ఆసక్తి ఉందని నాకు అనిపించింది. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది" అని అజరాషి తెలిపారు.
నెల రోజుల డేటింగ్ తర్వాతే ఒకరి అసలు వయసు మరొకరికి తెలిసింది. అప్పటికే పెళ్లై, పిల్లలున్న అజరాషి కొడుకు.. తన తల్లి బంధానికి మొదట్నుంచీ మద్దతుగా నిలిచాడు. అయితే, యువకుడి తల్లి మాత్రం అజరాషి తనకంటే వయసులో పెద్దది కావడంతో మొదట ఈ సంబంధాన్ని వ్యతిరేకించారు. కానీ, కొడుకు పట్టుబట్టడంతో చివరకు అంగీకరించారు.
ఈ జంట 2022లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఒక మ్యారేజ్ ఏజెన్సీని కూడా నడుపుతున్నారు. వీరి ప్రేమకథ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. కొందరు వీరిని ప్రశంసిస్తుండగా, మరికొందరు వయసు తేడాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.