Mahavatar Narasimha: ఓటీటీలోకి 'మహావతార్ నరసింహ' సినిమా: నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mahavatar Narasimha Movie OTT Release Date on Netflix
  • ఈ నెల 19న మధ్యాహ్నం 12.30 గంటలకు ఓటీటీలోకి సినిమా
  • మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన సినిమా
  • 53 రోజుల్లో రూ. 250 కోట్లు వసూలు చేసిన 'మహావతార్ నరసింహ'
'మహావతార్ నరసింహ' చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో 'నెట్ ఫ్లిక్స్' వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12:30 గంటలకు సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన వెలువడింది.

శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 60.5 కోట్లు వసూలు చేసి, తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ యానిమేటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. సినిమా విడుదలై 54 రోజులు కాగా, 53 రోజుల్లోనే రూ. 250 కోట్లు వసూలు చేసింది.
Mahavatar Narasimha
Netflix
Mahavatar Narasimha movie
Ashwin Kumar
Telugu movies
OTT release

More Telugu News