తెలంగాణలో అసమర్థ పాలన కొనసాగుతోంది: కేటీఆర్ విమర్శలు
- నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు
- మూడు రోజులు గడుస్తున్నా వెలికితీయకపోవడంపై ఆగ్రహం
- ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటనలో మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదని విమర్శ
గతంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత మానవత్వం లేని కాంగ్రెస్‌కు వినిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. నాలాల్లో బలి అయిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు.