ఒక మూగ బాలికను రక్షించలేకపోయింది ఈ ప్రభుత్వం!: రోజా
- విశాఖ సీతమ్మధారలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం
- మతిస్థిమితం లేని మూగ బాలికపై ఇద్దరు బాలుర అఘాయిత్యం
- తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఘటనపై తీవ్రంగా స్పందించిన వైసీపీ నేత రోజా
- ఇది రాక్షస ప్రభుత్వమా అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
"ఒక మూగ బాలికను కూడా రక్షించలేని ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇది మంచి ప్రభుత్వమా? రాక్షస ప్రభుత్వమా చంద్రబాబు గారూ? విశాఖపట్నం సీతమ్మధారలో మూగ బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడడం మీ అసమర్థ పాలనకు నిదర్శం కాదా?" అంటూ రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.