Ganesh: రాయదుర్గంలో రూ. 51 లక్షలు పలికిన గణేశుడి లడ్డూ

Ganesh Laddu Fetches Rs 51 Lakh in Rayadurgam
  • మైహోమ్ భుజాలో వేలంలో రికార్డు ధర పలికిన లడ్డూ ప్రసాదం
  • రూ. 51,77,777కు దక్కించుకున్న ఇల్లందుకు చెందిన గణేశ్
  • గత ఏడాది రూ. 29 లక్షలకు లడ్డూను దక్కించుకున్న గణేశ్
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్, గణేశుడి లడ్డూ అంటే బాలాపూర్ గణేశ్ లడ్డూ గుర్తుకు వస్తుంది. లడ్డూకు అత్యధిక ధర పలకడంలో కొన్నేళ్ల క్రితం వరకు బాలాపూర్ గణేశుడి పేరు మారుమోగింది. గత కొన్నేళ్లుగా ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూ ప్రసాదం రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. తాజాగా, రాయదుర్గంలో గణేశుడి లడ్డూ ఏకంగా రూ. 51 లక్షలు పలికింది.

రాయదుర్గంలోని మైహోమ్ భుజాలో గణేశు లడ్డూను ఇల్లందుకు చెందిన గణేశ్ అనే వ్యక్తి రూ. 51,77,777కు దక్కించుకున్నారు. గత ఏడాది ఇక్కడ లడ్డూ ధర రూ. 29 లక్షలు పలికింది. అప్పుడు కూడా ఈ లడ్డూను వేలంలో ఆయనే సొంతం చేసుకున్నారు.
Ganesh
Rayadurgam
Ganesh Laddu
Balapur Ganesh Laddu
My Home Bhuja
Ganesh Illandu

More Telugu News