Jagadish Reddy: కేసీఆర్ పై కుట్ర వెనుక రేవంత్ రెడ్డి మాత్రమే కాదు... మరో ఇద్దరి హస్తం ఉంది: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy alleges conspiracy against KCR involving Revanth Reddy Modi Chandrababu
  • కేసీఆర్‌పై రేవంత్, చంద్రబాబు, మోదీల కుట్ర ఉందన్న జగదీశ్ రెడ్డి
  • కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీయాలనుకుంటున్నారని మండిపాటు
  • దేశ రాజకీయాల్లో కీలకం అవుతారని భయపడుతున్నారని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై ప్రస్తుతం జరుగుతున్న కుట్రల వెనుక రేవంత్ రెడ్డి ఒక్కరే లేరని, ఆయనకు మోదీ, చంద్రబాబు మద్దతు ఉందని విమర్శించారు. కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి వీరు ముగ్గురూ కుట్ర పన్నుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్‌ను మానసికంగా బలహీనపరిచి, రాజకీయంగా ప్రయోజనం పొందాలన్నదే వారి ప్రధాన ఉద్దేశమని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఒకవేళ కేసీఆర్ మళ్లీ గెలిస్తే దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతారనే భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. 

బీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డే కేసీఆర్ పేరును స్మరిస్తుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ పేర్లు తలుచుకుంటే కానీ ఆయనకు రాత్రి నిద్ర పట్టదని అన్నారు. చివరకు బడి పిల్లల ముందు కూడా కేసీఆర్ గురించి చిల్లర వ్యాఖ్యలు చేయడం సీఎం స్థాయికి తగదని మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. కనీసం రైతులకు అవసరమైన యూరియాను కూడా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. కేసులు, కమీషన్లంటూ రేవంత్ రెడ్డి అనవసర డ్రామాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు.
Jagadish Reddy
KCR
Revanth Reddy
BRS
Telangana Politics
Chandrababu Naidu
Modi
Conspiracy
Telangana Government
Political News

More Telugu News