Mahesh Kumar Goud: అమెరికా వెళ్లి వచ్చాక కవితలో మార్పు వచ్చింది.. బాణం కేటీఆర్ మీద నుంచి హరీశ్ వైపు తిప్పారు: టీపీసీసీ చీఫ్

Mahesh Kumar Goud comments on Kavitha after US visit
  • కవిత కేసీఆర్ వదిలిన బాణమని భావిస్తున్నానన్న మహేశ్ కుమార్ గౌడ్
  • కవిత చెప్పిన విషయాలు వాస్తవమేనన్న టీపీసీసీ చీఫ్
  • పంపకాల్లో విభేదాలు వచ్చి పరస్పరం తిట్టుకుంటున్నారని వ్యాఖ్య
అమెరికా పర్యటన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కవిత ఇంతకాలం కేటీఆర్ మీద గురి పెట్టిన తన బాణాన్ని ఇప్పుడు హఠాత్తుగా హరీశ్ రావు వైపు మళ్లించారని ఆయన వ్యాఖ్యానించారు.

కవితను కేసీఆర్ వదిలిన బాణంగా తాను భావిస్తున్నానని, ఇది కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న కొత్త నాటకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కవిత చెబుతున్న విషయాలన్నీ వాస్తవమేనని, బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో పదేళ్లపాటు యథేచ్ఛగా దోపిడీ జరిగిందని అన్నారు.

ఆస్తుల పంపకాల్లో విభేదాలు రావడంతోనే వారు ఇప్పుడు బయటపడుతున్నారని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేయాలని ఎవరూ ప్రయత్నించడం లేదని, వారికి వారే చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతి సొమ్మును పంచుకుని ఇప్పుడు ఒకరినొకరు నిందించుకుంటున్నారని ఆయన అన్నారు.
Mahesh Kumar Goud
Kavitha
KTR
Harish Rao
TPCC
BRS party
Telangana
Telangana Jagruthi

More Telugu News