Kalvakuntla Kavitha: శాసనమండలి ఛైర్మన్ గుత్తాకు కవిత ఫోన్

Kalvakuntla Kavitha Resigns Nizamabad MLC Post
  • ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా
  • బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్‌బై
  • మండలి చైర్మన్‌కు ఫోన్ చేసి రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి
బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వెలుగొందిన కల్వకుంట్ల కవిత రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కవిత రాజీనామా లేఖను తెలంగాణ జాగృతి నాయకులు శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓఎస్డీకి అందజేశారు. అనంతరం కవిత స్వయంగా చైర్మన్ గుత్తాకు ఫోన్ చేసి, తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీనిపై స్పందించిన గుత్తా, తాను ప్రస్తుతం అందుబాటులో లేనని, గురువారం మరోసారి మాట్లాడిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం.

మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌లోని పార్టీ కార్యాలయంలో జాగృతి నాయకులు అందజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఉద్దేశించిన ఈ లేఖను భవన్ సెక్రటరీ స్వీకరించి, అందుకు సంబంధించిన రసీదును ఇచ్చారు.
Kalvakuntla Kavitha
BRS Party
Telangana
Nizamabad MLC
Gutta Sukhender Reddy
Telangana Bhavan
MLC Election
Telangana Jagruthi

More Telugu News