IMD: మంగళవారం నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

Low Pressure Area Likely Over Northwest Bay of Bengal
  • వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం
  • మంగళవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం
  • రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్ష సూచన
  • అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వానలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం (సెప్టెంబర్ 2) నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు సమీపంలో వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.

ఈ ఆవర్తనం ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడనుందని, దీని ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
IMD
India Meteorological Department
Bay of Bengal
low pressure area
weather forecast
Andhra Pradesh rains
heavy rainfall warning
AP disaster management
Odisha coast
West Bengal coast

More Telugu News