5 వేల భగవద్గీతలతో వినాయకుడు.. అబ్బురపరుస్తున్న వినూత్న రూపం
- తమిళనాడు రాజధాని చెన్నైలో వినూత్న గణపతి విగ్రహం
- వేలాది పవిత్ర గ్రంథాలతో రూపుదిద్దుకున్న గణనాథుడు
- విగ్రహం తయారీకి 5 వేల భగవద్గీత పుస్తకాల వినియోగం
- 'వేల్ విరుత్తమ్', 'మురుగన్ కావసం' పుస్తకాలు కూడా
చెన్నైలోని మన్నాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ మండపంలో కొలువుదీరిన ఈ గణనాథుడు పూర్తిగా పుస్తకాలతోనే రూపుదిద్దుకున్నాడు. ఈ అద్భుత విగ్రహం తయారీ కోసం నిర్వాహకులు ఏకంగా 5 వేల భగవద్గీత ప్రతులను వినియోగించడం విశేషం. వీటితో పాటు 1500 'వేల్ విరుత్తమ్', 1008 'మురుగన్ కావసం' వంటి ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా ఈ రూపం కోసం వాడారు.
ఈ వినూత్న విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మండపం వద్ద చిన్నారులు భజనలు, సంకీర్తనలు చేస్తూ ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నారు. పవిత్ర గ్రంథాలతో రూపుదిద్దుకున్న ఈ గణనాథుడు జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తున్నాడని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.