Thummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మంత్రి బహిరంగ లేఖ

Ministers Open Letter to Telangana Farmers on Urea Shortage
  • యూరియా కొరత అంశంపై లేఖ రాసిన మంత్రి
  • దేశమంతా యూరియా కొరత ఉందన్న తుమ్మల నాగేశ్వరరావు
  • యూరియా కొరతకు రెండు కారణాలు ఉన్నాయన్న మంత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా అంశంపై రైతులకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలోనే కాదని దేశమంతటా యూరియా కొరత ఉందని తెలిపారు.

తెలంగాణలో యూరియా కొరత పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ రాశారు. 

యూరియా కొరతకు ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఎర్ర సముద్రంలో నౌకాయానం నిలిచిపోవడంతో యూరియా సమయానికి అందడం లేదని తెలిపారు. రెండవది, దేశీయంగా యూరియా ఉత్పత్తి డిమాండుకు తగిన స్థాయిలో లేదని వెల్లడించారు.
Thummala Nageswara Rao
Telangana agriculture
Telangana farmers
Urea shortage
Fertilizer crisis

More Telugu News