Bunny Vasu: సినీ కార్మికుల సమ్మె వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం: బన్నీ వాసు

Bunny Vasu Reveals Difficulties Due to Film Workers Strike
  • ఒక్క రోజు షూటింగ్‌కు కోట్ల రూపాయల ఖర్చు అవుతుందన్న బన్నీ వాసు
  • షూటింగులు జరిగినా, జరగకపోయినా విదేశీ టెక్నీషియన్లకు చెల్లించాల్సిందేనని వెల్లడి
  • దేశంలో ఎక్కడ సమ్మె జరిగినా అన్ని చిత్ర పరిశ్రమలపై ప్రభావం ఉంటుందన్న వాసు
భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం ఎంతటి సవాళ్లతో కూడుకుని ఉంటుందో సినీ నిర్మాత బన్నీ వాసు వివరించారు. ముఖ్యంగా సినీ కార్మికుల సమ్మెల కారణంగా తాము ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన తొలిసారిగా స్పందించారు. ఓ చిన్న సినిమా ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ కీలక విషయాలను పంచుకున్నారు.

వివరాల్లోకి వెళితే... మధు శాలిని సమర్పణలో గీత్ సైని, శ్రీ చరణ్ రాచకొండ జంటగా నటించిన ‘కన్యా కుమారి’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీ వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముంబైలో AA22xA6 (అల్లు అర్జున్-అట్లీ) సినిమా షూటింగ్ జరుపుతున్నప్పుడు కార్మికుల సమ్మె వల్ల తాము ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు.

"దేశంలో ఎక్కడ సమ్మె జరిగినా దాని ప్రభావం అన్ని చిత్ర పరిశ్రమలపై ఉంటుంది. మా సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మాది రోజుకు కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న భారీ ప్రాజెక్ట్. పైగా విదేశీ టెక్నీషియన్లు చాలామంది ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. వారితో చేసుకున్న ఒప్పందాల ప్రకారం, షూటింగ్ జరిగినా జరగకపోయినా వారికి డబ్బు చెల్లించాల్సిందే. సమ్మె వల్ల వారిని ఖాళీగా కూర్చోబెట్టలేం, అలాగని చిత్రీకరణ కొనసాగించలేం. ఈ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాం" అని బన్నీ వాసు వివరించారు.
Bunny Vasu
Kanya Kumari Movie
Telugu cinema strike
AA22xA6 movie
Movie Production challenges
Film industry issues
Geet Saini
Sri Charan Rachakonda
Madhu Shalini

More Telugu News