భారత్ లో పర్యటించనున్న జెలెన్ స్కీ
- కీవ్ పర్యటనలో జెలెన్ స్కీని భారత్ కు ఆహ్వానించిన మోదీ
- ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా టూర్
- ఈ ఏడాది చివరిలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా భారత్ కు రాక
ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రధాని మోదీ ఒత్తిడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం వాదిస్తూ “ఇది యుద్ధ యుగం కాదు” అని నొక్కి చెప్పారు. పుతిన్, జెలెన్ స్కీలతో టెలిఫోన్ సంభాషణలు జరిపారు. భారతదేశం రెండు దేశాల మధ్య శాంతిని కోరుకుంటుందని వెల్లడించారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఏడాది చివరలో భారత్ కు రానున్నారు.