రూ.799 రీఛార్జి రద్దయిందా.. రిలయన్స్ జియో క్లారిటీ
--
యూజర్ల అవసరాలకు అనుగుణంగా, అందుబాటు ధరలో రీఛార్జి ప్లాన్లను అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు జియో పేర్కొంది. రూ.799 రీఛార్జి ప్లాన్ తో రీఛార్జి చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చని, రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని వివరించింది. అదేవిధంగా ఈ ప్లాన్ లో రోజుకు వంద ఎస్ఎంఎస్ లు పొందవచ్చని కంపెనీ పేర్కొంది.