Samyuktha Menon: నాకు మందు తాగే అలవాటు ఉంది: హీరోయిన్ సంయుక్త మీనన్ సంచలన వ్యాఖ్యలు

Samyuktha Menon Opens Up About Alcohol Consumption
  • ఒత్తిడిలో మద్యం తీసుకుంటానని వెల్లడించిన నటి సంయుక్త మీనన్
  • రోజూ తాగనని, ఆందోళనగా ఉన్నప్పుడే తీసుకుంటానని వివరణ 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంయుక్త వ్యాఖ్యలు
తెలుగులో వరుస విజయాలతో 'గోల్డెన్ బ్యూటీ'గా పేరు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్, ఇటీవల తాను చేసిన కొన్ని వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తనకు మద్యం సేవించే అలవాటు ఉందని ఆమె బహిరంగంగా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే, తాను రోజూ మద్యం తీసుకోనని, కేవలం తీవ్రమైన ఒత్తిడి లేదా ఆందోళనగా అనిపించిన సందర్భాల్లో మాత్రమే కొద్దిగా తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. మానసిక ప్రశాంతత కోసం అప్పుడప్పుడు ఇలా చేస్తానని సంయుక్త వివరించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త, ఆ తర్వాత ‘సార్’, ‘విరూపాక్ష’తో పాటు పలు చిత్రాలతో విజయాలు అందుకున్నారు. 

బాలకృష్ణతో కలిసి నటించిన 'అఖండ 2' సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 'స్వయంభు', 'నారి నారి నడుమ మురారి', పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Samyuktha Menon
Samyuktha Menon alcohol
Samyuktha Menon interview
Bheemla Nayak
Golden Beauty
Tollywood actress
Akhanda 2
Telugu movies
mental health
alcohol consumption

More Telugu News