US Citizenship: అమెరికా పౌరసత్వం కావాలా? అయితే ఈ కొత్త మార్పులు తప్పక తెలుసుకోండి!
- అమెరికా పౌరసత్వం కోసం కొత్త, కఠిన నిబంధనలు
- 'మంచి నైతిక ప్రవర్తన'పై సమగ్రంగా దర్యాప్తు చేయనున్న అధికారులు
- కేవలం నేరచరితనే కాదు.. మొత్తం సామాజిక జీవనంపై పరిశీలన
- సామాజిక సేవ, ఉద్యోగ స్థిరత్వం, పన్నుల చెల్లింపులకు ప్రాధాన్యం
- తీవ్రమైన నేరాలకు పాల్పడితే పౌరసత్వంపై శాశ్వత నిషేధం
- ప్రవర్తనలో మార్పు, పశ్చాత్తాపానికి సానుకూలంగా స్పందించే అవకాశం
అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన పరిణామం. దరఖాస్తుదారుల 'మంచి నైతిక ప్రవర్తన' (గుడ్ మోరల్ క్యారెక్టర్)ను అంచనా వేసే విషయంలో అక్కడి ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై కేవలం నేర చరిత్ర లేకపోతే సరిపోదని, దరఖాస్తుదారుడి మొత్తం ప్రవర్తన, సమాజంలో వారి జీవన విధానాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే పౌరసత్వంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
అమెరికా చట్టబద్ధమైన వలసల వ్యవస్థను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఈ మేరకు గత శుక్రవారం ఒక పాలసీ మెమోరాండం జారీ చేసింది. పౌరసత్వం అనేది అమెరికాలో నివసించడానికి, పనిచేయడానికి లభించే హక్కు మాత్రమే కాదని, సమాజంలో చురుకైన, బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఉండటమని ఆ ప్రకటనలో యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. "పౌరసత్వ దరఖాస్తును పరిశీలించడం అనేది కేవలం తప్పులు చేయలేదని నిర్ధారించుకోవడం కాదు.. దరఖాస్తుదారుడి ప్రవర్తన, సామాజిక నియమాలకు కట్టుబడి ఉండటం, సమాజానికి వారు చేసిన మంచి పనులను కూడా అంచనా వేయడం" అని తెలిపింది.
సంపూర్ణ మదింపు విధానం
ఇకపై అధికారులు 'సంపూర్ణ మదింపు' (totality of circumstances) విధానాన్ని అనుసరించనున్నారు. అంటే, దరఖాస్తుదారుడిలో ఉన్న సానుకూల, ప్రతికూల అంశాలను రెండింటినీ బేరీజు వేసి తుది నిర్ణయం తీసుకుంటారు. స్థిరమైన ఉద్యోగం, పన్నులు సక్రమంగా చెల్లించడం, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం, స్థానిక సమాజంలో స్వచ్ఛంద సేవలో పాల్గొనడం వంటివి సానుకూల అంశాలుగా పరిగణిస్తారు.
అదే సమయంలో పౌరసత్వానికి అనర్హులుగా మార్చే అంశాలపై మరింత లోతుగా దృష్టి సారిస్తారు. హత్య, తీవ్రమైన నేరాలు, హింస, మత స్వేచ్ఛను ఉల్లంఘించడం వంటివి పౌరసత్వంపై శాశ్వత నిషేధానికి దారితీస్తాయి. పదేపదే మద్యం సేవించి వాహనం నడపడం, పౌరసత్వం గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం, చట్టవిరుద్ధంగా ఓటు వేయడం వంటివి షరతులతో కూడిన అనర్హతలుగా ఉంటాయి.
అయితే, పిల్లల పోషణకు సంబంధించిన బకాయిలు చెల్లించడం, పన్నులు క్లియర్ చేయడం లేదా ప్రవర్తన మార్చుకున్నట్లు సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల నుంచి సాక్ష్యం చూపించడం వంటివి చేస్తే, వాటిని పునరావాసానికి చిహ్నంగా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారని యూఎస్‌సీఐఎస్ వివరించింది.
సాధారణంగా గ్రీన్ కార్డ్ హోల్డర్లు తమ పరిస్థితిని బట్టి మూడు లేదా ఐదేళ్ల తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనికి ఇంగ్లీష్, సివిక్స్ పరీక్షలలో ఉత్తీర్ణతతో పాటు 'మంచి నైతిక ప్రవర్తన' కలిగి ఉండటం తప్పనిసరి. ట్రంప్ పరిపాలనలో చట్టబద్ధమైన వలసలపై కూడా కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.