నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకలో మంత్రి లోకేశ్
- కాబోయే దంపతులను ఆశీర్వదించిన మంత్రి
- పాలకొల్లులో మంత్రికి గజమాలతో ఘన స్వాగతం
- మంత్రి నారా లోకేశ్ ను సత్కరించిన రామానాయుడు
మంత్రి నారా లోకేశ్ ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరి రామాంజనేయ రాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
