Cyber Crime: డిస్ట్రిబ్యూషన్ పేరిట రూ.5.41 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- హైదరాబాద్‌లోని చుడీ బజార్‌లో ఘటన
- బిర్లా పెయింట్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఆన్‌లైన్ సెర్చ్ చేసిన బాధితుడు
- ఓపస్ బిర్లా పెయింట్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పి మోసం
హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు ఓ కొత్త తరహా మోసానికి పాల్పడ్డారు. ఓ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తామని నమ్మించి రూ.5.41 లక్షలు కాజేశారు. పాతబస్తీలోని చుడీ బజార్‌కు చెందిన ఓ వ్యక్తి బిర్లా పెయింట్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు. దీన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు, ఓపస్ బిర్లా పెయింట్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తామని నమ్మించేలా ఫోన్ నెంబర్, ఇతర వివరాలు ఇచ్చారు.
బాధితుడు ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా, డిస్ట్రిబ్యూటర్‌గా రిజిస్ట్రేషన్, డెలివరీ, ఇతర ఖర్చుల పేరుతో రూ.5.41 లక్షలు తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.