Nara Lokesh: పులివెందులలో 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ: నారా లోకేశ్

Nara Lokesh says Pulivendula experienced freedom after 30 years
  • పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థుల గెలుపు
  • 30 ఏళ్ల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారన్న లోకేశ్
  • తిరోగమనాన్ని కాదని, పురోగతిని ఎంచుకున్నారన్న టీడీపీ నేత
  • విజయం సాధించిన లతారెడ్డి, కృష్ఠారెడ్డికి శుభాకాంక్షలు
  • భారీగా తరలివచ్చి మద్దతిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో తొలిసారిగా నిజమైన ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇది ఎంతో కష్టపడి సాధించిన విజయమని అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు తిరోగమనాన్ని కాదని, పురోగతికి పట్టం కట్టారని లోకేశ్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల విజయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన మారెడ్డి లతారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డిలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 

టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైందని లోకేశ్ పేర్కొన్నారు. 
Nara Lokesh
Pulivendula
ZPTC elections
Andhra Pradesh politics
TDP
Ontimitta
Mareddy Lata Reddy
Muddu Krishna Reddy
Kadapa district
AP elections

More Telugu News