YSRCP: హైకోర్టులో వైసీపీకి షాక్.. రీపోలింగ్ పై ఎన్నికల కమిషన్ దే తుది నిర్ణయమన్న హైకోర్టు
- పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించాలంటూ వైసీపీ పిటిషన్
- పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
- ఎలక్షన్ కమిషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో షాక్ లో ఉన్న వైసీపీకి... ఏపీ హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అవకతవకలకు పాల్పడిందని... పులివెందుల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని లేదా పోలింగ్ పై స్టే విధించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఈ విషయంలో తాము కలగజేసుకోలేమని తెలిపింది. రీపోలింగ్ పై ఎన్నికల కమిషన్ దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.
మరోవైపు, పిటిషన్ ను హైకోర్టు విచారించే సమయానికే పులివెందుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంకోవైపు, పులివెందుల స్థానంలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించామని హైకోర్టుకు ఈసీ తరపు న్యాయవాదులు తెలిపారు.
మరోవైపు, పిటిషన్ ను హైకోర్టు విచారించే సమయానికే పులివెందుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంకోవైపు, పులివెందుల స్థానంలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించామని హైకోర్టుకు ఈసీ తరపు న్యాయవాదులు తెలిపారు.