కోదండరామ్, అలీఖాన్‌ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- నియామకాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు
- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకం
- తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలన్న సుప్రీంకోర్టు
వారి నియామకాలను నిలిపివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పని సుప్రీంకోర్టు పేర్కొంది.