జమ్మూకశ్మీర్‌లో 1508 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ.. ఇదిగో వీడియో
- జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో తిరంగా ర్యాలీ
- 1508 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు
- వెల్కమ్ దోడా ఎంట్రీ గేటు నుంచి కమ్యూనిటీ హాల్ వరకు ర్యాలీ
- తిరంగా ర్యాలీ వీడియో నెట్టింట వైరల్
ఈ సందర్భంగా విద్యార్థులు తమ దేశభక్తిని చాటుకుంటూ దేశభక్తి గీతాలను ఆలపిస్తూ, నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ తిరంగా ర్యాలీ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.