Hyderabad Police: స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం.. ముఠా గుట్టు రట్టు

Hyderabad Spa Center Prostitution Racket Busted
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార దందా గుట్టు రట్టయింది. మేడిపల్లిలోని ద్వారకా నగర్‌లో ఉన్న ఒక స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేసి, ఈ రాకెట్‌ను భగ్నం చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడితో పాటు ఒక కస్టమర్‌ను అరెస్టు చేశారు. వ్యభిచార కూపంలో చిక్కుకున్న ఇద్దరు మహిళలను రక్షించారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ స్పా సెంటర్‌పై దాడి జరిగింది. విచారణలో ప్రధాన నిందితురాలు స్వప్న, ఆమె సహచరులు నవీన్, అశోక్ కుమార్‌తో కలిసి ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్టు తేలింది. వీరు మసాజ్ సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు.

ఈ ముఠా సభ్యులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను ఆకర్షించి, ఎక్కువ జీతాలు, కమీషన్ల ఆశ చూపి వ్యభిచారంలోకి దింపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
Go Back to Shorts
Hyderabad Police
Hyderabad
Spa center prostitution
Prostitution racket busted
Medipally
Telangana
Andhra Pradesh
Swpana
Naveen
Ashok Kumar

More Telugu News