బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్ చూసుకుని వెళుతుండగా ప్రమాదం... ఆరుగురి పరిస్థితి విషమం
- డోన్ లో బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్
- వేడుకకు హాజరైన జగన్
- ట్రాలీ ఆటో బోల్తాపడి 30 మందికి గాయాలు
హైవేపై వెల్దుర్తి వద్ద టైరు పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెల్దుర్తి ఆసుపత్రికి, కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు బేతంచర్ల మండలం రుద్రవరంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారంతా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. వేడుక అనంతరం తిరిగి వెళుతుండగా ప్రమాదం సంభవించింది.