సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి: హరీశ్ రావు
- సబిత పట్ల కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు దారుణం అంటూ హరీశ్ ఆగ్రహం
- మహిళా శాసనసభ్యురాలి పట్ల దౌర్జన్యం సిగ్గుచేటని వ్యాఖ్య
- ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్న హరీశ్
సాక్షాత్తు ఒక మంత్రి సమక్షంలో సబితపై కాంగ్రెస్ నేతలు గూండాల మాదిరి వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటే... పోలీసులు వారితో కలిసి సబితపై దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని అన్నారు. సబిత పట్ల అమర్యాదగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. రౌడీ మూకల దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్పారు. ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని అన్నారు.