కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొననున్న సీఎం
- ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
- పాల్గొననున్న రాహుల్, ప్రియాంక, ఖర్గే
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొననున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల ముఖ్యనాయకులు ఢిల్లీకి చేరుకున్నారు.
మరోవైపు, బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు.