Upasana Kamineni: రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

Upasana Expresses Gratitude to CM Revanth Reddy
  • తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా ఉపాసన నియామకం
  • ఛైర్మన్ గా సంజీవ్ గోయెంకాను నియమిస్తూ ఉత్తర్వులు
  • సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానన్న ఉపాసన
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఛైర్మన్ గా సంజీవ్ గోయెంకాను, కో-ఛైర్మన్ గా ఉపసనను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. 

ఎక్స్ వేదికగా ఉపాసన స్పందిస్తూ... సీఎం రేవంత్ కు థ్యాంక్స్ చెప్పారు. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి, క్రీడలు, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కు ధన్యవాదాలు తెలిపారు. 

క్రీడారంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025'ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను రూపొందించింది.
Upasana Kamineni
Revanth Reddy
Telangana Sports Hub
Sanjeev Goenka
Telangana Olympic Association
Venu Gopalachari
Jayesh Ranjan
Telangana Sports Policy 2025
Sports Development Telangana

More Telugu News