Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టివేత

Shamshabad Airport 40 Crore Rupees Drugs Seized
  • విమానాశ్రయంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విస్తృత తనిఖీలు
  • బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ నుంచి 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం
  • మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఈగల్ టీమ్, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పట్టణాల్లో జాతీయ రహదారులపై వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.

బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ నుంచి 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడిన హైడ్రోఫోనిక్ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Shamshabad Airport
Hyderabad Airport
Drug Seizure
Hydroponic Ganja
Narcotic Control Bureau

More Telugu News