Yuvraj Singh: డబ్ల్యూసీఎల్ నుంచి తప్పుకున్న భారత్... సెమీస్ ఆడకుండానే ఫైనల్లోకి పాక్

Yuvraj Singh led India withdraws from WCL Pakistan enters finals
  • ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ 
  • రేపు బర్మింగ్ హామ్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ సెమీస్
  • రాజకీయ ఉద్రిక్తతల కారణంగా టోర్నీ నుంచి వైదొలగిన భారత్
వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో రేపు భారత్-పాకిస్థాన్ మధ్య సెమీఫైనల్ సమరం జరగాల్సి ఉండగా... రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ టోర్నీ నుంచి భారత జట్టు వైదొలగింది. ఇప్పటికే ఓసారి గ్రూప్ దశలో పాక్ తో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. అయితే అది గ్రూప్ దశ కావడంతో ఇబ్బంది లేకుండా భారత్ ముందంజ వేసింది. కానీ రేపు జరిగేది నాకౌట్ పోరు (సెమీస్) కావడంతో, భారత్ తప్పుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ఆడకుండానే నేరుగా ఫైనల్ చేరింది. 

ఈ టోర్నీలో గ్రూప్ దశలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. తద్వారా సెమీస్ కు చేరుకుంది. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ కు యువరాజ్ సింగ్ నాయకత్వం వహించాడు. 
Yuvraj Singh
World Championship of Legends
WCL
India vs Pakistan
India withdraws
Pakistan in finals
Cricket tournament
Birmingham
Semi-finals
Political tensions

More Telugu News