C Kutumba Rao: పీ4 పథకంపై స్పష్టత ఇచ్చిన వైస్‌ ఛైర్మన్‌ సి.కుటుంబరావు

P4 Program Aims for Equality Says C Kutumba Rao
  • ఉగాది రోజున పీ4 పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు 
  • ఈ పథకంపై అపోహలు, ఆరోపణలు
  • వివరణ ఇచ్చిన పీ-4 ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ సి.కుటుంబరావు
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దిశానిర్దేశకుడిగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది పర్వదినాన పీ4 (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్స్ పార్ట్నర్‌షిప్ ప్రోగ్రాం) ను ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు స్వచ్ఛందంగా అట్టడుగునున్న కుటుంబాలు, వ్యక్తులు, గ్రామాల అభివృద్ధిలో తోడ్పడే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఈ పీ-4 విధానంపై ఉన్న అపోహలు, ఆరోపణలపై స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ సి.కుటుంబరావు వివరణ ఇచ్చారు.

పీ4 పథకం లక్ష్యం
సమాజంలో ఎవరైతే బాగా ఆర్థికంగా బలంగా ఎదిగారో, వారు అట్టడుగున ఉన్న బడుగు వర్గాలకు సహాయం అందిస్తే అసమానతలు తొలగుతాయి, సమాజంలో సమానత్వం నెలకుంటుంది. ప్రతి ఒక్కరూ వెల్తీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ పౌరులుగా జీవించగలుగుతారు. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించింది. సహాయం చేయగల సామర్థ్యం ఉన్నవారిని మార్గదర్శకులుగా గుర్తించి నమోదు చేసింది. ఈ పథకం పూర్తిగా వాలంటరీ, అంటే స్వచ్ఛందమే. ఎవరూ ఎవరినీ బలవంతంగా ఇందులో చేర్చడం లేదు.

పీ4 పై ఆరోపణలు అవాస్తవం
ఇటీవల కొన్ని విపక్షాలు, కొంతమంది వ్యక్తులు పీ4 పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డీఈవో (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్) గారు హెడ్ మాస్టర్లు, టీచర్లను మార్గదర్శకులుగా ఎన్ రోల్ కావాలని బలవంతం చేస్తున్నారనే ఆరోపణలు అవాస్తవం. ఎటువంటి అధికార ఆదేశాలు విడుదల కాలేదు. ఎవరికి ఇష్టమైతే వారు మాత్రమే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమంలో అవాస్తవాలకు తావు ఇవ్వొద్దు. ఎవరైనా బలవంతం చేస్తే, దయచేసి సంబంధిత అధికారులకు లేదా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వగలరు.

మార్గదర్శకులకు ఆదర్శం సీఎం చంద్రబాబు
ఇప్పటికే 50,000 మందికి పైగా మార్గదర్శకులు స్వచ్ఛందంగా నమోదు అయ్యారు. 6 లక్షల బంగారు కుటుంబాలు గుర్తించబడ్డాయి. మార్గదర్శకులు కూడా వారిని దత్తత తీసుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 250 కుటుంబాలను దత్తత తీసుకొని పీ4 పథకానికే ఆదర్శంగా నిలిచారు. భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా, ప్రపంచ స్థాయిలో బిలియనర్లు ఎదుగుతున్న దేశంగా గుర్తింపు పొందుతోంది. 

అధిక శాతం బిలియనర్లు మన దేశస్థులే. అయితే వారితో పాటు అట్టడుగున ఉన్నవారిని ఆర్థికంగా, సామాజికంగా మెరుగుపరచాల్సిన బాధ్యత ఆ బిలియనర్ల బాధ్యత. ఇందుకే ప్రభుత్వం వారిని స్వచ్ఛందంగా ఈ పథకంలో భాగం కావాలని కోరుతోంది. అలాగే, పీ4 పథకంలో పాల్గొంటున్న ప్రభుత్వాధికారులు అందరూ కూడా దీన్ని వాలంటరీ ప్రోగ్రామ్‌గా మాత్రమే చూడాలని, ఎటువంటి బలవంతం లేకుండా పని చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది... అని కుటుంబరావు వెల్లడించారు. 
C Kutumba Rao
P4 program
Andhra Pradesh
Chandrababu Naidu
Swarnandhra P4 Foundation
Public Private Peoples Partnership
golden families
development program
volunteer program
AP development

More Telugu News