Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Central Government Key Announcement on Polavaram Banakacherla Project
  • ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రభుత్వం తెలిపిందన్న కేంద్రం
  • రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్న
  • లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర జల్ శక్తి శాఖ
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

సాంకేతిక, ఆర్థిక అంచనా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీ ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర జల సంఘానికి అందించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతూ లేఖ రాసినట్లు పార్లమెంటుకు తెలిపింది. ప్రాజెక్టుపై సంబంధిత అధికారులు, పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
Polavaram Project
Andhra Pradesh
AP Government
Central Government
Banakacherla Project

More Telugu News