రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు... చేతలు కావాలి: హరీశ్ రావు
- నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజనింగ్
- అస్వస్థతకు గురైన బాలికలు
- బాలికలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత హరీశ్ రావు
"గతంలోనూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగితే, మరోసారి ఇలాంటివి చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి అన్నారు... మరి ఉయ్యాలవాడ ఘటన ఎలా జరిగింది? సీఎం ఆదేశాలు అధికారులు పాటించడం లేదా? ఢిల్లీకి వెళ్లడానికి దొరికిన సమయం, విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు దొరకదా? ఫుడ్ పాయిజనింగ్ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలి... మానవ హక్కుల కమిషన్, హైకోర్టు వీటిని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి... రేవంత్ రెడ్డీ... మాపై కోపం ఉంటే మమ్మల్ని జైల్లో పెట్టండి... అంతేగానీ విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోకండి" అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు.