Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో పాము కలకలం... పరుగులు తీసిన భక్తులు!
- రాహుకేతు ఆలయంలో 7 అడుగుల పాము
- అటవీ సిబ్బందికి సమాచారం అందించిన ఆలయ వర్గాలు
- పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసిన అటవీ సిబ్బంది
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలోని రాహుకేతు ఆలయంలో పాము కలకలం రేగింది. ఆలయ ప్రాంగణంలోకి 7 అడుగుల పొడవున్న పాము ప్రవేశించడంతో భక్తులు హడలిపోయారు. రాహుకేతు పూజల్లో పాల్గొనే మండపం మెట్ల వద్ద పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. దాంతో ఆలయ అధికారులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ పామును చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు. దాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.