Hari Hara Veera Mallu: నేడు కూడా ఢిల్లీలోని ఏపీ భవన్ లో 'హరిహర వీరమల్లు' ప్రదర్శన

Hari Hara Veera Mallu Screening at AP Bhavan Delhi
  • ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరి హర వీరమల్లు చిత్ర ప్రదర్శన
  • నిన్న రాత్రి మొదటి షోకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరవ్వడంతో పూర్తిగా నిండిపోయిన ఆడిటోరియం
  • ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' ఈ నెల 24న విడుదలైంది. ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు అందుకుంది.

ఈ నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడిన తెలుగు వారికి ఈ చిత్రాన్ని చేరువ చేసేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. నిన్న రాత్రి 7 గంటలకు జరిగిన మొదటి షోకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరవ్వడంతో ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది. ఈరోజు (ఆదివారం) కూడా రెండు షోలను ప్రదర్శించనున్నారు.

ఢిల్లీలో విధుల్లో ఉన్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న తెలుగు ప్రజల కోసం ఏపీ భవన్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. వారాంతపు సెలవు దినాలైన శని, ఆదివారాల్లో ఏపీ భవన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఈ విషయాన్ని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ప్రకటించారు. రోజుకు రెండు షోలు ప్రదర్శిస్తున్నట్లు ఆయన వివరించారు. 
Hari Hara Veera Mallu
Pawan Kalyan
AP Bhavan
Delhi
Telugu Movie
Movie Screening
Pan India Movie
Love Agarwal
Andhra Pradesh
B R Ambedkar Auditorium

More Telugu News