Kingdom Movie: 'కింగ్డ‌మ్' ట్రైల‌ర్‌.. విజయ్ దేవరకొండ మాస్ ట్రీట్

Vijay Devarakonda Kingdom Trailer Released
  • విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో 'కింగ్డ‌మ్'
  • తిరుప‌తిలో జ‌రిగిన ఈవెంట్‌లో మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన‌ మేక‌ర్స్ 
  • ప్రేక్షకులను ఆకట్టుకునేలా విజయ్ చేసిన‌ యాక్షన్, చెప్పిన‌ డైలాగ్స్ 
  • ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్న రౌడీ బాయ్‌
  • ఈ నెల‌ 31న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్డమ్'. తిరుప‌తిలో జ‌రిగిన ఈవెంట్‌లో ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ మోడ్‌లో క‌నిపించింది. విజయ్ దేవరకొండ నుంచి ఇలాంటి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ గతకొంత కాలంగా మిస్ అవుతున్న ఫ్యాన్స్‌కు ఇది మాస్ ట్రీట్ అని చెప్పొచ్చు. 

ట్రైల‌ర్‌లో విజయ్ చేసిన‌ యాక్షన్, చెప్పిన‌ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆయన మేకోవర్ కూడా కొత్త‌గా ఉంది. మరోవైపు, యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్‌ అనిరుధ్ రవిచంద‌ర్ కూడా తన సంగీతంతో ఈ ట్రైలర్‌ను ఎక్క‌డికో తీసుకెళ్లారు. 

గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న హీరోయిన్‌గా భాగ్యశ్రీ న‌టిస్తుండ‌గా... సత్యదేవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. ఈ నెల‌ 31న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Kingdom Movie
Vijay Devarakonda
Vijay Devarakonda Kingdom
Gowtam Tinnanuri
Sithara Entertainments
Anirudh Ravichander music
Bhagyashree
Telugu movies 2024
Action movie trailer
Satya Dev

More Telugu News