Test Tube Baby Center: సికింద్రాబాద్‌లో వీర్యం నిల్వ చేసిన డాక్టర్ అరెస్ట్

Secunderabad Test Tube Baby Center Doctor Arrested for Semen Storage
  • దంపతులకు ఇతరుల వీర్య కణాలతో సంతానం కలిగించిన టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్
  • దంపతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
  • సరోగసి కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించిన పోలీసులు
సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో అక్రమాలు వెలుగు చూశాయి. శనివారం పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఒక మహిళ తన భర్త వీర్య కణాల ద్వారా సంతానం పొందాలనే ఆశతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించింది. అయితే, వైద్యులు వేరే వ్యక్తి వీర్యకణాలతో ఆమెకు గర్భం కలిగించారు. అనుమానం వచ్చిన దంపతులు డీఎన్ఏ పరీక్ష చేయుంచగా, అది వేరే వ్యక్తి డీఎన్ఏగా తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన పోలీసులు శనివారం ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సరోగసి కోసం పెద్ద ఎత్తున వీర్యాన్ని నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. వీర్య సేకరణలో అక్రమ పద్ధతులు అవలంబిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డాక్టర్‌తో పాటు ఆ సెంటర్‌లో పనిచేస్తున్న మరో ఏడుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Test Tube Baby Center
Secunderabad
Semen Storage
Doctor Arrested
Infertility Clinic

More Telugu News