Ayyanna Patrudu: ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉభయ సభల సంయుక్త కమిటీల ఏర్పాటు... వివరాల ఇవిగో!

Ayyanna Patrudu AP Assembly Joint Committees Announced
  • పలు కమిటీలను ప్రకటించిన అయ్యన్న, మోషేను రాజు
  • 2025-26కి గాను కమిటీలు
  • ప్రకటన విడుదల
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సంయుక్త కమిటీలను నేడు ప్రకటించారు. 2025-26 గానుఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన సంయుక్త కమిటీలను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రకటించారు. సదుపాయాల కమిటీ, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ, అనసూచిత వర్ణముల సంక్షేమ కమిటీ, అనుసూచిత జాతుల సంక్షేమ కమిటీ, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ కమిటీ, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, మరియు వయోవృద్ధుల సంక్షేమ కమిటీ, అనుగత చట్ట నిర్మాణ కమిటీ, వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ, గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేశారు. 

ఆయా కమిటీలకు చైర్మన్లు/చైర్ పర్సన్లు వీరే...

1. సదుపాయాల కమిటీ- అయ్యన్నపాత్రుడు
2. వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ- అయ్యన్నపాత్రుడు
3. అనసూచిత వర్ణముల సంక్షేమ కమిటీ- కుమార్ రాజా వర్ల
4. అనుసూచిత జాతుల సంక్షేమ కమిటీ- మిరియాల శిరీషా దేవి
5. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ కమిటీ- మహ్మద్ నజీర్ అహ్మద్
6. మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, మరియు వయోవృద్ధుల సంక్షేమ కమిటీ- గౌరు చరితారెడ్డి
7.  అనుగత చట్ట నిర్మాణ కమిటీ- తోట త్రిమూర్తులు
8. వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ- బీదా రవిచంద్ర
9. గ్రంథాలయ కమిటీ- పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి
Ayyanna Patrudu
AP Assembly
AP Legislative Council
Joint Committees
Andhra Pradesh
MLA
MLC
Welfare Committees
Speaker
Chairman

More Telugu News